హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన ఆర్టీసీ సిబ్బంది

RR: షాద్‌నగర్‌లో భార్యతో కలిసి బస్ ఎక్కిన వ్యాపారవేత్త జహంగీర్, అఫ్జల్‌గంజ్‌లో దిగే సమయంలో రూ.3 లక్షల నగదు ఉన్న బ్యాగును బస్సులోనే మర్చిపోయాడు. బ్యాగును గుర్తించిన మహిళా కండక్టర్ సరిత, డ్రైవర్ నర్సింహులు భద్రపరిచారు. కొద్దిసేపటికి జహంగీర్ తిరిగి రాగా, నగదును అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. వారి మానవత్వాన్ని ప్రయాణికులు అభినందించారు.