హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి మంత్రి వివేక్ శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్‌లో డా. బీ.ఆర్‌ అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేశారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను కళలు, సాహిత్యం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఆకాంక్షించారు.