హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల దాడిని ఖండిస్తూ BRS శ్రేణులు రాస్తారోకో

BDK: అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల అరెస్టుపై అశ్వారావుపేట నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. నియోజకవర్గ మాజీ MLA, BRS పార్టీ ఇంఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం హామీలను అమలు చేయాకుండా కేవలం విమర్శలకే పరిమితం అవుతుందని తెలిపారు. తక్షణమే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.