హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీట్ విజేత మాజీ ఎమ్మెల్యే అభినందనలు

NTR: తక్కెళ్ళపాడుకు చెందిన మార్కపుడి సందీప్ ఇటీవల విడుదలైన నీట్ ఫలితాలలో ఉత్తమ ర్యాంకు సాధించి ఎంబీబీఎస్ సీటు పొందారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు సందీప్‌ను అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు. సందీప్ తల్లిదండ్రులు మార్కపుడి జయరాజు, యేసమ్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.