హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాసనసభలో సెంట్రల్ హాల్‌ను ప్రారంభించిన సీఎం

HYD: తెలంగాణ శాసనసభలో ఏర్పాటు చేసిన 'దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్'ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌లతో కలిసి సీఎం ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.