హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

అనకాపల్లి జీవీఎంసీ 82వ వార్డులో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్‌ లైటింగ్, తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వార్డులో రూ.16.5 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. రూ.2.47 కోట్లతో నిర్మిస్తున్న బాలుర హాస్టల్‌ను దసరా నాటికి పూర్తి చేస్తామన్నారు.