హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆర్జిలను వేగంగా పరిష్కరించేలా చర్యలు'

ASF: తిర్యాణి మండల MPDO కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో నగేశ్ అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజావాణి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇక్కడకి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.