WGL: నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించిన అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎంఆర్‌వో కృష్ణ సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
నల్లబెల్లిలో ప్రజావాణి కార్యక్రమం


