హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం సమావేశంలో పాల్గొన్న టీడీపీ ఇన్‌ఛార్జ్

KDP: బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఇవాళ అమరావతిలోని జాతీయ టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌ఛార్జ్‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించారు.