హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వినాయక మండపాలకు అనుమతులు తప్పనిసరి'

అన్నమయ్య: రాయచోటిలో వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందుగా విద్యుత్, ఫైర్ డిపార్ట్‌మెంట్, మైక్, లౌడ్‌స్పీకర్ తదితర శాఖల నుంచి అనుమతులు పొందాలని సీఐ చలపతి సూచించారు. అనుమతులు లేకుండా మండపాలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.