NLG: చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అద్దంకి రవీందర్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. నల్గొండ 1టౌన్ SI సైదులు ఆధ్వర్యంలో ఈ చర్య చేపట్టినట్లు రవీందర్ తెలిపారు. హోంశాఖకు మంత్రి నియమించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముందస్తు అరెస్టులతో తమ ఆందోళనలను అడ్డుకోలేరని పేర్కొన్నారు.
తెలంగాణ
ఆప్ నేత ముందస్తు అరెస్ట్


