RR: కేశంపేట మండలంలో నిర్వహించిన ప్రజావాణికి అధికారుల గైర్హాజరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 21 శాఖలకు గాను కేవలం 4 శాఖల అధికారులే హాజరయ్యారు. ఉదయం 10.30గంటలు దాటినా కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. సర్ ప్రోగ్రామ్ పేరుతో అధికారులు రాకపోవడంతో అర్జీదారులు నిరాశతో వెనుతిరిగారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
ప్రజావాణికి అధికారుల డుమ్మా


