హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆపిలేపల్లిలో తాగునీటి కోసం మహిళల నిరసన

ATP: కుందుర్పి మండలం ఆపిలేపల్లి గ్రామంలో సోమవారం తీవ్రమైన తాగునీటి సమస్యతో మహిళలు ఆందోళనకు దిగారు. నీటి కోసం మైళ్ల దూరానికి వెళ్లాల్సి వస్తోందని, వృద్ధులు, పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని మండిపడుతూ, తక్షణమే తాగునీటి సరఫరాను క్రమబద్ధీకరించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.