హైదరాబాద్: 28°C
తెలంగాణ

జానపద కళాకారిణి కనకవ్వకు విశిష్ట పురస్కారం

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల పరిధిలోని బొడిగపల్లికి చెందిన కళాకారిణి గొట్టే కనకవ్వ పొన్నం సత్తయ్య జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 13న రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో రూ.50 వేల నగదు, మెమెంటో, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు ట్రస్టు ఉపాధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ తెలిపారు. కళారంగంలో ఆమె అందిస్తున్న సేవలకు గాను ఈ గౌరవం దక్కింది.