హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పనిచేయని చేతిపంపు.. చర్యలు ఏవి..!

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి(M)దిన్నెపాడు గ్రామంలోని బెస్తపల్లి హరిజనవాడలో చేతిపంపు గత 3 నెలలుగా పనిచేయకపోవడంతో స్థానికులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతిపంపు చెడిపోయినా అధికారులు పట్టించుకోకపోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చేతిపంపును వెంటనే మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.