హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్కను చూసేందుకు వెళ్తూ.. అనంతలోకాలకు

VZM: గజపతినగరం (M) ముచ్చర్లకు చెందిన ఒడ్డు నరసమ్మ (41) ఆదివారం తన అక్కను చూసేందుకు కుమారుడు, మేనల్లుడితో కలిసి ద్విచక్ర వాహనంపై జరజాపుపేట వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కొండగుంపాంకి చెందిన పతివాడ వినోద్ ట్రాక్టర్‌తో పొలంలో దుక్కి దున్ని పూతికపేట వైపు వస్తుండగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నరసమ్మను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.