WG: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తణుకు ఆర్టీసీ డిపో పరిధిలో 21 అద్దె బస్సులను నిలిపివేసి డ్రైవర్లు సోమవారం నిరసనకు దిగారు. ఉదయం నుంచి డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ డిపో మేనేజర్ సుధారాణికి వినతిపత్రం అందజేశారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఆంధ్రప్రదేశ్
బస్సులు బంద్.. ప్రయాణికుల అవస్థలు


