ASR: అనంతగిరి మండలంలోని శివలింగపురం పాఠశాలలో ఉపాధ్యాయులు ఉండే గదుల పైకప్పు పెచ్చులూడుతూ ప్రమాదకరంగా మారింది. పైకప్పు దెబ్బతినడంతో లోపలి ఇనుము బయటకు కనిపిస్తోంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పెచ్చులు ఊడి పడితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
శివలింగపురంలో ప్రమాదకరంగా ఉపాధ్యాయుల గదులు


