హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం మత్తులో భార్యను హత్య చేసిన భర్త

PLD: వెల్దుర్తి మండలం ఉప్పలపాడులో కొర్రా చిన వెంకయ్య అనే వ్యక్తి మద్యం మత్తులో రోకలి బండతో భార్య మల్లమ్మ (65) హత్య చేసి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన ఈ నెల 4 తేదీన జరిగినట్లు సమాచారం. దుర్వాసన రావడంతో చుట్టు పక్కల వాళ్లు ఆమె కుమారులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.