NLR: జిల్లాలో సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డా.అజిత వేజెండ్ల సూచించారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, కుటుంబ వివాదాలు, చిన్నపాటి ఘర్షణలను ఇరుపక్షాల అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. దీనివల్ల కక్షిదారులకు సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు, దీర్ఘకాలిక కేసుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
12న జాతీయ లోక్ అదాలత్


