హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమశిల జలాశయంలో 17 టీఎంసీలు నీరు నిల్వ

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా విడుదల చేశారు. సోమవారం ఉదయం 6 గంటల నాటికి 17.130 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయంలో 133 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది. సోమశిల జలాశయం నుండి పెన్నా డెల్టాకు 2000 క్యూసెక్కులు, కావలి కెనాల్ కు 700 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.