అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో డ్రైనేజీ సమస్యతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం స్వల్ప వర్షానికే కాంప్లెక్స్ ఆవరణలోకి భారీగా నీరు చేరి జలమయమైంది. దీంతో ప్రయాణికులు నీటిలోనే రాకపోకలు సాగించాల్సి వచ్చింది. వర్షం వచ్చిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఎదురవుతోందని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
జలమయమైన అనకాపల్లి RTC బస్టాండ్


