AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 87,115 మంది భక్తులు దర్శించుకోగా.. 35,053 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తి
తిరుమల సమాచారం


