TG: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇవాళ సెలవురోజు కావడంతో స్వామివారి ఉచిత దర్శనానికి దాదాపు రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు గంట సమయం పడుతోంది. భక్తులు ఆలయంలో మొక్కు కళ్యాణం, ఆర్జిత పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
భక్తి
యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ


