హైదరాబాద్: 28°C
భక్తి

వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తులు

TG: శ్రావణమాసం ముగింపు సందర్భంగా వేములవాడ భీమేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఉదయాన్నే తలనీలాలు సమర్పించి పవిత్ర స్నానాలు ఆచరించారు. ధర్మదర్శనం, కోడెమొక్కు క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీతో క్యూలైన్లు కిటకిటలాడుతుండగా, దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. భక్తులు కోడె మొక్కులతో పాటు ప్రత్యేక పూజలు చెల్లించుకుంటున్నారు.