హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి.. డ్రైవర్‌కు గాయాలు

కోనసీమ: కొత్తపేట బోడిపాలెం వద్ద ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి బస్సుపై రాళ్లతో దాడి చేసి పరారయ్యాడు. షాక్‌కు గురైన డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో స్టీరింగ్‌పై సొమ్మసిల్లి పడిపోయి స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే డ్రైవర్‌ను 108లో కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం కోలుకున్నాడు. ప్రయాణికుల వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.