W.G: ఇటీవల మృతి చెందిన టీడీపీ కార్యకర్త, మాజీ వార్డు సభ్యుడు బొంతు నాగశ్రీను కుటుంబానికి మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం రూ. 1లక్ష ఆర్థిక సాయం అందించారు. పోడూరు మండలం పెనుమదం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని అన్నారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షుడు దొరబాబు, మాజీ సర్పంచ్ తానేటి బాబురావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కార్యకర్త కుటుంబానికి మంత్రి ఆర్థిక సాయం


