హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వివాహిత అదృశ్యం.. కేసు నమోదు

KKD: కరప మండలం పాతర్లగడ్డకు చెందిన పెమ్మాడ సంధ్యా ప్రసన్న (30) అదృశ్యమైనట్లు తల్లి దుర్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహిత అయిన ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన కుమార్తె అదృశ్యానికి జగ్గంపేటకు చెందిన శ్రీనివాస్ కారణమని తల్లి ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI సునీత వెల్లడించారు.