SRPT: మునగాల మండల కేంద్రంలోని నారాయణగూడెం రోడ్డులో ఆదివారం రాత్రి రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నేలమర్రి గ్రామానికి చెందిన మంగయ్య అక్కడికక్కడే మృతి చెందగా, వెంకన్న తీవ్రంగా గాయపడ్డారు. బంధువుల ఇంట్లో దినకర్మకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి


