హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కాకినాడలో పీజీఆర్ఎస్: కలెక్టర్

KKD: సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కాకినాడ కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. గతంలో ఇచ్చిన అర్జీల పరిష్కార స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. రెవెన్యూ క్లినిక్‌లో కేవలం రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.