హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి'

KDP: స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని జిల్లా ఉపాధ్యక్షుడు మాచనూరు సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం మైదుకూరు బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి పార్టీలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.