హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో ఎన్నికల ప్రక్రియ వేగవంతం'

ATP: స్థానిక సంస్థలకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ సుధాకర్‌రావు ఆదేశించారు. జిల్లాలోని జడ్పీ, డీడీఓ, ఎంపీడీఓలతో జూమ్ సమావేశం నిర్వహించారు. గ్రామాలను గుర్తించి మ్యాపింగ్ చేయాలని, 2026 జనవరి 1 ఓటర్ల జాబితాలను ఆన్‌లైన్ చేసి మూడు సెట్లు సిద్ధం చేయాలని సూచించారు.