హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్ష్మీనరసింహస్వామికి నేడు ఆర్జిత కల్యాణం

SS: కదిరి శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నేడు ఉదయం 6 నుంచి 6.45 గంటల వరకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు అభిషేక, స్వర్ణకవచ సేవలు నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటలకు ఆర్జిత కల్యాణం జరుగుతుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.