MDK: రామాయంపేట మండల పరిధిలో నేడు (సోమవారం) ఉదయం 8:30 గంటల నుంచి రైతులకు యూరియా అందుబాటులోకి వస్తుందని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. రామాయంపేట, కోనాపూర్ పీఏసీఎస్‌ల ద్వారా ఎరువులను అందజేస్తామన్నారు. యూరియా అవసరమున్న రైతులు ముందస్తుగా ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
తెలంగాణ
నేడు రైతులకు యూరియా సరఫరా


