హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన పాఠశాలలో లైబ్రరీ ప్రారంభం

SRD: చౌటకూర్ మండల పరిధిలోని బొమ్మరెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ ఫౌండేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన లైబ్రరీ, స్టడీ సెంటర్‌ను ఐటీ శాఖ కమిషనర్, ఐఆర్‌ఎస్ డాక్టర్ సుధాకర్ నాయక్ ఆదివారం ప్రారంభించారు. పుస్తకాలు చదవడం వల్ల ఆలోచనా విధానం పెరుగుతుందని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించి సమాజానికి సేవ చేయాలని సూచించారు.