PDPL: గోదావరిఖని పట్టణం 11 కేవీ శారదానగర్ ఫీడర్ పరిధిలో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనులు చేపట్టనున్నారు. ఈ కారణంగా ఇవాళ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పీజీ సెంటర్ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా అయ్యే శారదానగర్, కేసీఆర్ కాలనీ, చంద్రబాబు కాలనీ, సాయి కాలనీ, ఆర్టీసీ కాలనీలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ వంశీకృష్ణ తెలిపారు. వినియోగదారులు సహకరించాలన్నారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరా లో అంతరాయం


