హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తనను వెంబడించిన వారిపై MRO ఫిర్యాదు

MNCL: విధుల అనంతరం ఓ వ్యక్తి కారులో తనను వెంబడించాడని మందమర్రి MRO సతీష్ కుమార్ తెలిపారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో టీ హోటల్ వద్ద, శ్రీనివాస గార్డెన్‌లోని తన సోదరి ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా అదే వ్యక్తి కారులో వెంబడించినట్లు పేర్కొన్నారు. మందమర్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనను వెంబడించడం వెనుక బలమైన కారణం ఉండొచ్చన్నారు.