హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు శ్రీ రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవం

KMR: ఎల్లారెడ్డిలోని వెల్లుట్లపేటలోని కారడవిలో చినంగిపల్లి రాజరాజేశ్వర స్వామి వారి జాతర మహోత్సవాన్ని నేడు ఘనంగా నిర్వహించనున్నట్లు సర్పంచ్ కొయ్యల వినోద రాజాగౌడ్ తెలిపారు. జాతర సందర్భంగా సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, గ్రామ పెద్దలు, మిత్రులు, శ్రేయోభిలాషులు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.