హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కూటీ అదుపుతప్పి ముగ్గురికి గాయాలు

JGL: జగిత్యాలలో స్కూటీ అదుపుతప్పి ముగ్గురు గాయపడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పట్టణంలోని యావర్ రోడ్డులో నూర్ మజీద్ ఎదురుగా ముగ్గురు స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడిపోయారు. ప్రమాదంలో ఇస్లాంపురకు చెందిన మడసు అశోక్ (60), సుద్దాల లక్ష్మణ్ (63), ముత్త మల్లేశం (45) గాయపడ్డారు. 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.