హైదరాబాద్: 28°C
తెలంగాణ

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ ఫలితాలు విడుదల

ADB: ఆగస్టులో నిర్వహించిన టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) కోర్సు థియరీ పరీక్షల ఫలితాలు విడుదల అయినట్లు డీఈఓ మాధవి ఆదివారం తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలను అధికారిక వెబ్‌సైట్ www.bse.telangana.gov.in లో నమోదు చేసి మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.