హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో వాహన తనిఖీలు

కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. లైసెన్సులు, హెల్మెట్లు లేని వాహనదారులపై జరిమానాలు విధించడంతో పాటు, మందు తాగి వాహనాలు నడిపేవారిని గుర్తించి సీజ్ చేశారు. అక్రమ రవాణా నిరోధానికి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.