WNP: జిల్లా కేంద్రం మర్రికుంటలో కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఉమామహేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆదివారం విశ్వశాంతి మహాయాగశాల ప్రాంగణంలో రుత్విక బ్రాహ్మణులు ఈ కల్యాణ క్రతువును సంప్రదాయబద్ధంగా జరిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
తెలంగాణ
వైభవంగా ఉమామహేశ్వర స్వామి కల్యాణం


