హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంథని యువతకు ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలు

PDPL: మంథని నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలకు చెందిన యువతకు ప్రముఖ బహుళజాతి సంస్థ ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలు లభించాయి. ముత్తారం, రామగిరి, కాటారం, పలిమెల, మహాదేవపూర్, మహముత్తారం, కమాన్‌పూర్, మంథని మండలాలకు చెందిన విద్యార్థులకు శిక్షణ అనంతరం ఉద్యోగాలు దక్కాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు వారి చేతులకు నియామక పత్రాలు అందజేశారు.