హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతాంగానికి జనసేన శ్రేణులు అండగా నిలవాలి'

కృష్ణా: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో జనసేన శ్రేణులు రైతాంగానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. అవనిగడ్డ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పంటలు వేయలేకపోయిన రైతులకు ఆర్థిక సాయం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రైతులు సాగు చేసిన పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కృతజ్ఞతలు తెలిపారు.