హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1.03 లక్షల విరాళం

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి, విస్తరణ పనుల కోసం హనుమకొండకు చెందిన డాక్టర్ చందన, అనిల్ కుమార్ రెడ్డి దంపతులు రూ.1,03,250 విరాళం అందజేశారు. ఆలయ డిప్యూటీ ఈవో ప్రతాప్ నవీన్ కుమార్‌కు నగదును అందించగా, అధికారులు దాతలను శేషవస్త్రంతో సత్కరించి లడ్డూ ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో వంశీమోహన్ శర్మ, ఆగమరావు తదితరులు పాల్గొన్నారు.