హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్..!

కృష్ణా: పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్సై సుభాషిణి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 4,010 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని ఎస్సై తెలిపారు. మండలంలో పేకాట, కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.