NTR: జగ్గయ్యపేట పోలీసులు సైబర్ నేరాలు, గంజాయి నిర్మూలనపై వినూత్న పద్ధతిలో అవగాహన కల్పించారు. ఎన్‌టీఆర్ సర్కిల్, నెహ్రూ సెంటర్, రైతు బజార్ ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా ఆడియో సందేశాలను ప్రసారం చేశారు. ఓటీపీ, ఏటీఎం పిన్ వంటి వివరాలు పంచుకోవద్దని, మోసపోతే 1930కు కాల్ చేయాలని సూచించారు. గంజాయి సమాచారం అందిస్తే నగదు బహుమతులు ఇస్తామని ఎస్సై శంకర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గంజాయిపై అవగాహన కార్యక్రమం


