ADB: సిరికొండ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సిడాం వెంకట్ ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. మండల కేంద్రం నుంచి గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు గమనించి వెంటనే 108కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది వెంకట్‌ను చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు


