హైదరాబాద్: 28°C
వార్తలు

22Aపై రేవంత్ వివరణ ఇవ్వాలి: రఘునందన్ రావు

TG: 22A అంశంపై సీఎం రేవంత్ వివరణ ఇవ్వాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో 22ఏపై చర్చ జరగాలన్నారు. 22ఏలో లక్షల కోట్ల భూ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానం చెప్పాలని తెలిపారు. పేదల భూములను ఎందుకు 22ఏ నుంచి తీయరని నిలదీశారు. అసెంబ్లీకి కేసీఆర్ హాజరుకావాలని సూచించారు.