భవనం కూలిన ఘటన వివరాలను ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. కూలిన భవనం 40-50 ఏళ్ల క్రితం కట్టినట్లు తెలుస్తోందన్నారు. భవనం బేస్‌మెంట్ మరమత్తులు చేస్తుండగా కూలిందని చెప్పారు. ఆరంతస్తుల భవనంలో పీజీ హాస్టల్ నడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం శిథిలాల వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
వార్తలు
భవనం కూలిన వివరాలు వెల్లడించిన పోలీసులు


